అదొక జలపాతం... ఏటా కొన్ని రోజులు మాత్రం అదొక అద్భుతం! ప్రపంచ పర్యాటకులు వచ్చి చూస్తారు... ఇంతకీ ఏం జరుగుతుంది? నీళ్లు మంటల్లా కనిపిస్తాయి!
జలపాతం అంటేనే కిందకి దూకే నీటి ధారలు. కానీ అవే ధారలు బంగారు రంగులో మెరిసిపోతే? అగ్నిపర్వతం నుంచి చిమ్ముకొచ్చే లావాలా కనిపిస్తే? ఆ అద్భుతాన్ని చూడాలంటే కాలిఫోర్నియాలోని 'హార్స్‌టెయిల్' జలపాతం దగ్గరకు వెళ్లాల్సిందే. అయితే ఎప్పుడు పడితే అప్పుడు వెళితే లాభం లేదు. ఏడాదిలో కేవలం రెండు వారాలు మాత్రమే అవకాశం. ఆ రోజుల్లో సూర్యుడు అస్తమించేప్పుడు కొద్ది క్షణాల పాటు నీళ్లన్నీ కిందికి దూకుతున్న మంటల్లా మారి పోతాయి. సూర్యకిరణాలు ఒక ప్రత్యేక కోణంలో పడేప్పుడు జరిగే వింత ఇది. అందుకే దీన్ని 'ఫైర్‌ఫాల్స్' అని కూడా అంటారు.
* యోస్‌మైట్ జాతీయ పార్కులో ఎల్‌క్యాపిటన్ అనే కొండపై నుంచి పడే ఈ జలపాతం కేవలం కొన్ని రుతువుల్లో మాత్రమే ఏర్పడుతుంది.
* ఏటా ఫ్రిబ్రవరి చివరి రెండు వారాలు మాత్రం సూర్యుడు అస్తమించేప్పుడు ఈ జలపాతం రంగులు మారిపోతాయి. తెల్లని నీళ్ల ధార క్రమంగా బంగారు రంగులోకి మారుతుంది. కాసేపటిలోనే ఎరుపు రంగును పులుముకుంటుంది. అప్పుడు మంటలు దూకుతున్నట్టే అనిపిస్తుంది!
* ఆ రెండు వారాల కోసం దేశదేశాల నుంచి వేలాది పర్యాటకులు ఇక్కడికి వచ్చి ఫొటోలు తీసుకుంటారు.
* ఇది ఏకంగా 2000 అడుగుల ఎత్తు నుంచి కిందికి దూకుతుంది! అంటే 200 అంతస్తుల భవనమంత ఎత్తన్నమాట!
* ఈ కొండ ప్రపంచంలోనే అతిపెద్ద గ్రానైట్ కొండ.
- ====================
No comments:
Post a Comment