Sunday, February 10, 2013

Entrance only to Obese,వూబకాయులకే ప్రవేశం

ప్రపంచము లో కొన్ని విషయాలే మనకు తెలుసు . తెలియనివి ఇంకా ఎన్నో మిగిలే ఉంటాయి. ఆ విషయం తెలుసుకున్న తర్వాత ఇంతేనా? అని అనిపిస్తుంది. ప్రతివ్యక్తికి అన్నివిషయాలు తెలియాలని ఏమీలేదు . తెలియవుకూడా. ఇప్పుడు ఈ క్రింది విషయం చదవండి మీకు తెలుసునేమో?...
  •  
  •  
అధిక బరువుతో బాధపడుతున్నవాళ్లు చక్కగా నాజూగ్గా తయారవ్వాలని ఆశపడుతుంటారు. కానీ జిమ్‌కు వెళ్లాలంటే మాత్రం వెనకాడుతుంటారు. ఎందుకంటే అందరూ చేసే వర్కవుట్లు తాము చేయగలమో లేదోననే సంశయం వాళ్లను వెంటాడుతుంది. అమెరికాలోని 'డౌన్‌సైజ్‌' జిమ్‌ యజమాని ఫ్రాన్సిస్‌ ఈ ఇబ్బందిని గుర్తించాడు. అందుకే ఉండాల్సిన బరువుకంటే ఓ పాతిక కేజీలు ఎక్కువ ఉన్నవారికి మాత్రమే తన జిమ్‌లో ప్రవేశం కల్పించాడు. దాంతో వూబకాయులంతా హుషారుగా వ్యాయామాలు చేసుకోడానికి ఆ జిమ్‌కే వెళుతున్నారట. పనిలోపనిగా మరో రెండుమూడు చోట్లా బ్రాంచ్‌లు ప్రారంభించాడు ఫ్రాన్సిస్‌. ఇతడూ ఒకప్పుడు అధిక బరువుతో బాధపడ్డవాడే. అందుకే స్వీయ అనుభవాలను వ్యాపారానికి జోడించిమరీ ముందుకు దూసుకుపోతున్నాడు.
  • ===================
 visit my website - > Dr.Seshagirirao.com

No comments: