Sunday, February 10, 2013

Earthen dish , మట్టి వంటకం


ప్రపంచము లో కొన్ని విషయాలే మనకు తెలుసు . తెలియనివి ఇంకా ఎన్నో మిగిలే ఉంటాయి. ఆ విషయం తెలుసుకున్న తర్వాత ఇంతేనా? అని అనిపిస్తుంది. ప్రతివ్యక్తికి అన్నివిషయాలు తెలియాలని ఏమీలేదు . తెలియవుకూడా. ఇప్పుడు ఈ క్రింది విషయం చదవండి మీకు తెలుసునేమో?...
  •  

రుచికీ శుచికీ మారుపేరుగా నిలవాలని చాలా హోటళ్లు తపన పడుతుంటాయి. అయితే టోక్యోలోని నెక్విజ్‌పస్‌ రెస్టారెంట్‌లోని వంటకాల్లో ఉపయోగించే ముఖ్యమైన పదార్థం ఏంటో తెలుసా... మట్టి. పైగా ఇది అల్లాటప్పా మట్టికాదు. కనుమా అనే ప్రాంతం నుంచి తెచ్చిన ప్రత్యేకమైన మట్టి. దీన్ని ఇప్పటికీ మొక్కల పెరుగుదలకు ఎరువుగా వాడుతున్నారు. ఈ రెస్టారెంట్‌కు చెందిన తోషియో తనాబే అనే షెఫ్‌ ఓ వంటల పోటీలో పాల్గొని తన ప్రత్యేక వంటకంతో బహుమతి పొందాడు. ఎంతో రుచికరంగా అతడు తయారుచేసిన సాస్‌లో మట్టినే వాడాడట. అప్పటినుంచీ ఈ రెస్టారెంట్‌లోని ప్రతి వంటకంలో రుచిని పెంచడానికి ఈ మట్టినే వాడుతున్నారట. ఆహారప్రియులు దాదాపు ఆరువేల రూపాయలు చెల్లించిమరీ ఆ వంటకాలు తిని 'ఆహా ఏమి రుచి' అంటున్నారట.

  • ========================
visit my website - > Dr.Seshagirirao.com

No comments: