ప్రపంచము లో కొన్ని విషయాలే మనకు తెలుసు . తెలియనివి ఇంకా ఎన్నో మిగిలే ఉంటాయి. ఆ విషయం తెలుసుకున్న తర్వాత ఇంతేనా? అని అనిపిస్తుంది. ప్రతివ్యక్తికి అన్నివిషయాలు తెలియాలని ఏమీలేదు . తెలియవుకూడా. ఇప్పుడు ఈ క్రింది విషయం చదవండి మీకు తెలుసునేమో?...
టాంగ్ షుక్వాన్,రబ్బరు మనిషి,బూచోడు
మీరెప్పుడైనా బూచాడ్ని చూశారా? చైనాకెళితే చూడొచ్చు... ఇంతకీ ఏం చేస్తాడు? ముఖాన్ని భయంకరంగా మార్చేస్తాడు! ఆ విద్యతోనే గిన్నిస్ సాధించాడు కూడా!
ఎవరినైనా వెక్కిరించాలంటే నాలుక పైకి పెట్టి, మూతి వంకరగా తిప్పి 'వ్వెవ్వెవ్వె...' అంటారు మీరు. అప్పుడు అద్దంలో మీ ముఖాన్ని మీరు చూసుకుంటే నవ్వొస్తుంది. అలా నవ్వు రాకుండా భయం కలిగేంత వికృతంగా మొహం పెట్టగలరా? ఒకవేళ ప్రయత్నించినా చైనాలో ఉండే టాంగ్ షుక్వాన్‌లాగా పెట్టనే లేరు. ఎందుకంటే అతను ముఖాన్ని బోలెడు ముడతలతో భయంకరంగా, అసహ్యంగా మార్చేయగలడు. అదాటున చూస్తే భయపడాల్సిందే. అందుకే అతడికి 'రబ్బరు మనిషి' అనే పేరొచ్చింది. ముఖాన్ని ఇన్ని వంకర్లు చేయగల వ్యక్తి ప్రపంచంలో ఇతనొక్కడే అని గిన్నిస్‌వాళ్లు రికార్డు కూడా కట్టబెట్టారు.
టాంగ్ మామూలుగా ఉన్న ఫొటోను చూడండి. ఎంత బావున్నాడో అనిపిస్తుంది. కానీ అదే ముఖాన్ని అతడు రకరకాలుగా మార్చేయగలడు. కళ్లు కనపడకుండా చర్మాన్ని కప్పేయగలడు. పళ్ళతో ముక్కును కొరకగలడు. ముఖం నిండా ముడతలను సృష్టించగలడు. ఆ సమయంలో 43 ఏళ్ల టాంగ్ 90 ఏళ్ల వృద్ధుడిలా కనిపిస్తాడు. ఈ విద్యతోనే ఇతగాడు బోలెడు ప్రదర్శనలు ఇస్తూ, లక్షలాది రూపాయలు సంపాదిస్తున్నాడు. ఈ మధ్యే ఇటలీలో ప్రదర్శన ఇస్తే ఐదు లక్షల రూపాయలు వచ్చాయి. అన్నట్టు... ఇతగాడు ఓ సవాలు కూడా విసురుతున్నాడు. అదేంటో తెలుసా? తనలాగా ముఖాలు పెట్టగలిగితే 75,000 రూపాయలు ఇస్తానంటున్నాడు. ఈ విద్యను నేర్చుకోవడానికి ఇతడు పదేళ్లు సాధన చేశాట్ట.
- ====================
No comments:
Post a Comment