Sunday, February 10, 2013

Foam all over the Town,వూరంతా నురగ

ప్రపంచము లో కొన్ని విషయాలే మనకు తెలుసు . తెలియనివి ఇంకా ఎన్నో మిగిలే ఉంటాయి. ఆ విషయం తెలుసుకున్న తర్వాత ఇంతేనా? అని అనిపిస్తుంది. ప్రతివ్యక్తికి అన్నివిషయాలు తెలియాలని ఏమీలేదు . తెలియవుకూడా. ఇప్పుడు ఈ క్రింది విషయం చదవండి మీకు తెలుసునేమో?...
  •  


  •  
ఆస్ట్రేలియాలోని మూలూలబ పట్టణంలోని ప్రజలంతా ఓ శుభోదయాన అసలేం జరుగుతుందో తెలియక పరుగులు పెట్టడం మొదలుపెట్టారు. ఒక్కసారిగా వూళ్లోని వీధులన్నీ నురగతో నిండిపోయాయి. ఇది పది అడుగుల ఎత్తు వరకూ వ్యాపించింది. కొందరు సెల్‌ఫోన్లలో ఈ అరుదైన దృశ్యాన్ని బంధించారు. తుపాను వల్ల వీచిన బలమైన గాలుల వల్ల పసిఫిక్‌ మహా సముద్ర కెరటాలు ఇలా నురగ్గా మారాయని వాతావరణ శాఖ వివరించింది. కొన్ని గంటల తర్వాత పరిస్థితి యథాస్థితికి వచ్చేసినా ఆ కాసేపూ ప్రజలంతా ముందు భయంతో వణికి, తరవాత కారణం తెలిసి ఆశ్చర్యపోయి, ఆ తరవాత ఎంత తమాషాగా ఉందీ అని ఆనందపడి, గంతులేశారట ఆ నురగలోనే.

  • ====================
visit my website - > Dr.Seshagirirao.com

No comments: