Sunday, February 10, 2013

Bottle Bulb,సీసా బల్బు

ప్రపంచము లో కొన్ని విషయాలే మనకు తెలుసు . తెలియనివి ఇంకా ఎన్నో మిగిలే ఉంటాయి. ఆ విషయం తెలుసుకున్న తర్వాత ఇంతేనా? అని అనిపిస్తుంది. ప్రతివ్యక్తికి అన్నివిషయాలు తెలియాలని ఏమీలేదు . తెలియవుకూడా. ఇప్పుడు ఈ క్రింది విషయం చదవండి మీకు తెలుసునేమో?...
  •  
  •  image :  courtesy with Eenadu Telugu daily.
ఫిలిప్పీన్స్‌లోని సెబూ, మనీలా లాంటి పట్టణాల్లోని ఎక్కువ ఇళ్లల్లో పట్టపగలు కూడా వెలుతురు రానేరాదు. 24 గంటలూ లైటు వెలుగుతూ ఉండాల్సిందే. రోజంతా కరెంటుతో లైటు వెలిగితే బిల్లు కట్టుకోవడమూ వాళ్లకు కష్టమే. దీనికి పరిష్కారంగా 'మై షెల్టర్‌ ఫౌండేషన్‌' అనే సంస్థ సీసా బల్బులను వెలిగిస్తోంది. బ్రెజిల్‌లోని ఆల్‌ఫ్రెడో మోసెరో అనే మెకానిక్‌కు వచ్చిన సరికొత్త ఆలోచనే ఈ సీసా బల్బు. అమెరికాలోని మసాచుసెట్స్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ విద్యార్థులు ఆ ఆలోచనను అభివృద్ధి చేసి సీసా బల్బును అందరికీ అందుబాటులోకి తీసుకువచ్చారు. దీన్ని ఎలా తయారుచేస్తారంటే... లీటరు నుంచి రెండు లీటర్ల సామర్థ్యమున్న రంగులేని ప్లాస్టిక్‌ సీసాను తీసుకోవాలి. దాన్ని పూర్తిగా నీటితో నింపాలి. నీటిలో కొద్దిగా క్లోరిన్‌ లేదా బ్లీచింగ్‌ పౌడర్‌ కలపాలి. ఇలా చేయడం వల్ల దాదాపు అయిదేళ్లపాటు నీళ్లు మార్చనవసరంలేదు. ఇంటి పైకప్పు మీద సీసా దిగేంత రంధ్రం చేసి అందులో సీసా అమర్చి చుట్టూ సీల్‌ చేసేయాలి. సీసా సగానికి పైగా ఇంటి లోపలి భాగంలో ఉండాలి. ఇలా చేయడం వల్ల పగటి సమయంలో 55 నుంచి 60 వాట్ల బల్బుతో సమానమైన వెలుగు ఇంట్లోకి ప్రసరిస్తుందట. ఐడియా బాగుంది కదా.

A project that has a lot with very little. It turns out that millions of people living in areas of developing countries live in homes with very little light. Inside these houses seem at night even during the day. A funny and simple assembly made ​​with a plastic bottle of water or soda manages to provide light to the interior of the housing. And all without electricity.
"A Liter of Light" or "Isang Litrong Liwanag" is a project that was born in the Philippines MyShelter foundation Foundation.

The lighting system is not something new bottles. The engineer Brazilian Alfredo Moser was first experienced in bringing light through plastic bottles. This idea has been used in many countries. MyShelterFoundation improved thanks to the new design idea developed by students from the Massachusetts Institute of Technology.


  • ==================
visit my website - > Dr.Seshagirirao.com

No comments: