Friday, February 7, 2014

Small monkeys, బుల్లి కోతులు

ప్రపంచము లో కొన్ని విషయాలే మనకు తెలుసు . తెలియనివి ఇంకా ఎన్నో మిగిలే ఉంటాయి. ఆ విషయం తెలుసుకున్న తర్వాత ఇంతేనా? అని అనిపిస్తుంది. ప్రతివ్యక్తికి అన్నివిషయాలు తెలియాలని ఏమీలేదు . తెలియవుకూడా. ఇప్పుడు ఈ క్రింది విషయం చదవండి మీకు తెలుసునేమో?...
  •  

  •  Small monkeys, బుల్లి కోతులు
 దక్షిణ అమెరికాలోని అమెజాన్ నది చుట్టూ ఉన్న తీర ప్రాంతంలో సుమారు ఐదున్నర మిలియన్ చదరపు కిలోమీటర్ల మేర విస్తరించి ఉందీ అమెజాన్ వర్షారణ్యాలు. ఈ సతత హరితారణ్యం 60% అరణ్యం బ్రెజిల్‌లో, మిగిలిన అరణ్య ప్రాంతం పెరూ, కొలంబియా, వెనిజులా, ఈక్వెడార్, బొలీవియా, గయానాలలో ఉంది.. సంవత్సరం పొడవునా పచ్చగా ఉండే వృక్షాలతో అలరారే ఈ సతత హరితారణ్యాలలో విలక్షణమైన కోతుల జాతులు చాలానే ఉన్నాయి. ‘స్పైడర్ మంకీస్’ ‘స్క్విరల్ మంకీస్ అనే పొడుగు తోక కోతులు, యుకారీస్ అనే పొట్టితోక బట్టతల కోతులు, సాకీ అనే పొడవైన కుచ్చుతోక కోతులు, మార్మోసెట్స్ అలాగే టమారిన్ అనే చిన్న కోతులు ఈ అరణ్యాలలో ఎతె్తైన చెట్ల కొమ్మల మీద సంచరిస్తూ వింతైన అరుపులు, శబ్దాలు చేస్తాయి.
హౌలర్ మంకీ అనే కోతుల అరుపులు అరణ్యంలో కొన్ని మైళ్ల దూరం వరకు వినిపిస్తాయి.
ఈ వర్షారణ్యాలు కోతులకి స్వర్గ్ధామం లాంటిది. ఎంచేతనంటే వీటికి ఆహారమైన పండ్లు, గింజలను, ఎతె్తైన చెట్ల మీద నుండి తీసుకుని తింటూ, ఎక్కువగా చెట్ల మీదే గడిపేస్తాయి. పగటి వేళల్లోనే కాదు రాత్రులలో కూడా చెట్ల మీదే ఉంటూ అక్కడే నిద్రపోతాయి.
  • ==================
 visit my website - > Dr.Seshagirirao.com

No comments: