వింత నిజాలు మీకు తెలుసా? : పిల్లల కోసం.. సేకరణ/డా.శేషగిరిరావు(యం.బి.బి.యస్) - శ్రీకాకుళం. ' Strange truths .. Do you know? : for Children collected / Dr.Seshagirirao(MBBS) - Srikakulam
గుర్రాలు పడుకోవడము అత్యంత అరుదుగా చూసి ఉంటాము . అదెప్పుడు నిలుచునే ఉంటుంది .నిద్రపోవటం కుడా నిలుచునే . అయితే మిగిలిన జీవుల్లా నిలుచుని నిద్రపోయినా తూలిపడదు . గుఱ్ఱము కీళ్ళు , ఎముకలు , కండరాలు ఆ ప్రత్యేక లక్షణాన్ని కలిగియున్నాయి .
గుఱ్ఱము నిద్రకు ఉపక్రమించాగానే దాని ఎములలు స్థిరపడి కీళ్ళు ఒకరకంగా బిగుసుకుంటాయి . . . ఇక కాలు వంగవు అందుకే గుఱ్ఱము నిలుచుని నిద్రపోయినా ఎటుపక్కకీ పడిపోదు .